'గాడ్ ఫాదర్'ని కలిసిన 'లైగర్'
on Aug 1, 2022
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'లైగర్'. ఆగస్టు 25న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా 'లైగర్' టీమ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంది.
మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్'లో చిరంజీవి ప్రధాన పోషిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో చిరు, సల్మాన్ కలిసి ఓ సాంగ్ లో చిందేసి కనువిందు చేయనున్నారు. అంతేకాదు ఈ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా ఈ సాంగ్ షూట్ ముంబైలో జరగగా.. సెట్ లో 'లైగర్' టీమ్ సందడి చేసింది. ఇండియన్ సూపర్ స్టార్స్ ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం సంతోషంగా ఉందని మూవీ టీమ్ తెలిపింది. చిరు, సల్మాన్ ని కలిసిన వారిలో విజయ్, పూరి జగన్నాథ్, ఛార్మి ఉన్నారు.
కాగా లైగర్ టీమ్ షేర్ చేసిన ఫొటోలో చిరంజీవి, సల్మాన్ చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఫోటోతోనే ఆకట్టుకుంటున్న ఈ స్టార్స్ తమ స్టెప్పులతో ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఫిదా చేస్తారో చూడాలి.
Also Read